ఆర్గానిక్ మ్యాప్స్: ఆఫ్‌లైన్ హైక్, బైక్, ట్రైల్స్ మరియు నావిగేషన్

Organic Maps అనేది హైకింగ్, సైక్లింగ్ మరియు డ్రైవింగ్ కోసం గోప్యత-కేంద్రీకృత ఆఫ్‌లైన్ మ్యాప్స్ & GPS యాప్. పూర్తిగా ఉచితం. ప్రకటనలు ఉండవు. మిమ్మల్ని ట్రాక్ చేయదు. ఓపెన్-సోర్స్ కమ్యూనిటీ మరియు MapsWithMe/Maps.Me యాప్ వ్యవస్థాపకుల ద్వారా ప్రేమతో అభివృద్ధి చేయబడింది. OpenStreetMap డేటా ద్వారా శక్తివంతం చేయబడింది.

ఈరోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా 100% లక్షణాలను మద్దతు చేసే ఏకైక అప్లికేషన్ ఒక్క ఓర్గానిక్ మ్యాప్స్ మాత్రమే. ఓర్గానిక్ మ్యాప్స్ ఇన్స్టాల్ చేసి, మ్యాప్లను డౌన్‌లోడ్ చేస్కోని మీ సిమ్ కార్డును విసిరేయండి ( మీ ఆపరేటర్ నిరంతరం మిమ్మల్ని ఎలానో ట్రాక్ చేస్తుంది అనుకోండి ).ఇప్పుడు ఒక్క బైట్ కూడా నెట్వర్క్ కి పంపకుండా సింగల్ బాటరీ ఛార్జింగ్ తో వారంపాటు విహారయాత్రకు నిచ్చతింగా వెళ్లి రండి.

డిసెంబర్ 2025లో, ఆర్గానిక్ మ్యాప్స్ 60 లక్షల ఇన్‌స్టాల్‌లను చేరుకుంది. స్కేల్ చేయడానికి మాకు సహాయం చేయండి!

AppStore, Google Play, FDroid, Huawei AppGallery, Accrescent నుండి ఓర్గానిక్ మ్యాప్స్ ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.

AppStore నుండి Organic Maps ను ఇన్‌స్టాల్ చేయండి Google Play నుండి Organic Maps ను ఇన్‌స్టాల్ చేయండి Huawei AppGallery నుండి Organic Maps ను ఇన్‌స్టాల్ చేయండి Install Organic Maps via Obtainium F-Droid నుండి Organic Maps ను ఇన్‌స్టాల్ చేయండి

హైకింగ్

ప్రేగ్ పట్నం

ఆఫ్లైన్ సెర్చ్

డార్క్ మోడ్లో నావిగేషన్

ఫీచర్స్

పర్యాటకులకు, హైకర్లు మరియు సైకిలిస్టులకు క్రింది ఫీచర్ల చే ఈ "ఓర్గానిక్ మ్యాప్స్" అత్యంత మైత్రిగల యాప్ గా మారింది:

ఆర్గానిక్ మ్యాపులే ఎందుకు ?

"ఆర్గానిక్ మ్యాప్స్"స్వచ్ఛమైనది .ఇది ప్రేమతో తయారు చేయపడినది.

"ఆర్గానిక్ మ్యాప్స్" యాప్ ట్రాకర్‌లు మరియు ఇతర దుష్ట పద్ధతులు నుండి స్వేచ్ఛగా ఉంటాది.

ఈ అప్లికేషన్ ఎక్సోడస్ ప్రైవసీ ప్రాజెక్ట్ ద్వారా ధృవీకరించబడింది.

Exodus Privacy verified Organic Maps app

iOS అనువర్తనం TrackerControl for iOS ద్వారా ధృవీకరించబడింది.

TrackerControl for iOS verified Organic Maps app

ఆర్గానిక్ మప్స్ మీ మొయిద నిఘా ఉంచాడనికి అనవసరమైన అనుమతులు అడగదు

Permissions requested by the Organic Maps app Permissions requested by the Maps.me app for comparison

ఈ ఆర్గానిక్ మప్స్ లో , మేము మీ గోప్యతను ప్రాధమిక హక్కుగా భావిస్తాము .

పరివీక్షణను తిరస్కరించండి - మీ స్వాత్రంత్యాన్ని స్వాగతించండి

ఆర్గానిక్ మ్యాప్స్ ని ఒకసారి ప్రయత్నించండి!

మరి ఈ ఉచిత అనువర్తనానికి ఎవరు చెల్లిస్తున్నారు?

ఈ అనువర్తనం అందరికీ ఉచితం. మాకు తోడ్పడేందుకు [విరాళం] (@/donate/index.te.md) ఇవ్వండి!

సులభంగా విరాళం ఇచ్చేందుకు, మీకు నచ్చిన చెల్లింపు విధానం యొక్క ఐకాన్ పై నొక్కండి:

దిగువన ఉన్న సంస్థాగత స్పాన్సర్‌లు కొన్ని మౌలిక సదుపాయాల ఖర్చులను కవర్ చేయడానికి మరియు ఎంచుకున్న కొత్త ఫీచర్‌ల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి లక్ష్య గ్రాంట్‌లను అందించారు:

The NLnet Foundation శోధన మరియు మూలాల మెరుగుదల ప్రాజెక్ట్ NGI0 ఎంట్రస్ట్ ఫండ్ ద్వారా నిధులు సమకూర్చబడింది. NGI0 ఎంట్రస్ట్ ఫండ్ NLnet ఫౌండేషన్ ద్వారా స్థాపించబడింది, ఇది యూరోపియన్ కమిషన్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ నుండి ఆర్థిక సహాయంతో, గ్రాంట్ ఒప్పందం నం 101069594 కింద DG కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్స్, కంటెంట్ మరియు టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉంది.
Google Summer of Code Google 2022, 2023, 2024, 2025 ప్రోగ్రామ్‌ల సమయంలో Google సమ్మర్ ఆఫ్ కోడ్ ప్రోగ్రామ్‌లో విద్యార్థి ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇచ్చింది. ఆండ్రాయిడ్ ఆటో, వికీపీడియా డంప్ ఎక్స్‌ట్రాక్టర్, ఆండ్రాయిడ్ ట్రాక్ రికార్డింగ్ వంటి ముఖ్యమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
Mythic Beasts ISP Mythic Beasts మ్యాప్ డౌన్‌లోడ్‌లు మరియు అప్‌డేట్‌లను హోస్ట్ చేయడానికి మరియు అందించడానికి 400 TB/నెల వరకు ఉచిత బ్యాండ్‌విడ్త్‌తో రెండు వర్చువల్ సర్వర్‌లను మాకు అందిస్తుంది.
44+ Technologies 44+ Technologies వియత్నాం మరియు ఆగ్నేయాసియాలో మ్యాప్‌లను అందించడానికి సంవత్సరానికి సుమారు $12,000 విలువైన ఉచిత డెడికేటెడ్ సర్వర్‌ను మాకు అందిస్తుంది.
FUTO FUTO ఫిబ్రవరి 2023లో ఆర్గానిక్ మ్యాప్స్‌కు $1000 మైక్రో-గ్రాంట్‌ను మంజూరు చేసింది.

సంఘం

ఆర్గానిక్ మ్యాప్స్, అపాచీ లైసెన్స్ 2.0 గల ఒక స్వేచ్ఛామూలాలు సాఫ్ట్‌వేర్.